గిరిజన యువతికి అన్యాయం

డామిడ్ కధ అడ్డం తిరిగింది గిరిజన యువతి కి అన్యాయం జరిగినా సంఘటన ఆదివారం నాడు చోటుచేసుకుంది

వివరాల్లోకి వెళితే పొదిలి మండలం సూదనగుంట గ్రామం అంగన్వాడీ కార్యకర్త పోస్టు రోస్టర్ లో యస్టీకి రిజర్వేషన్ చేసి నోటిఫికేషన్ గత నవంబర్ విడుదలైంది .

గడువు లోపల సదరు అంగన్వాడీ కార్యకర్త పదవికి గాలేటి స్వాతి అనే యువతి దరఖాస్తు చేసుకొగా సదరు కార్యకర్త పోస్టుకు ఓకే దరఖాస్తు రావటంతో తనకు ఖచ్చితంగా అంగన్వాడీ కార్యకర్త రావటం ఖాయం రెండు రోజుల నియామకం పత్రం అందుకొని ఉద్యోగం లో చేరవచ్చు అనే లోగా డామిడ్ కధ అడ్డం తిరిగింది తెర వెనుక సుత్రధారులు పాత్రధారులు ఎవరో అడుగు పెట్టి ఎలాంటి ఒత్తిడి చేసారో ఏమో నిన్న శనివారం నాడు ఆ యువతి కి పోస్ట్ ద్వారా ఒక ఉత్తర్వు వచ్చింది దానిలో దరఖాస్తు కాలంలో గ్రామ పేరు తప్పుగా వ్రాసిన కారణంగా దరఖాస్తు ను తిరస్కరిస్తునట్లు లేఖ ద్వారా తెలపటం తో ఒక్కసారి తన ఆశాల పై నిల్లు చల్లినట్లు అయింది

దానితో తనకు జరిగిన అన్యాయం గురించి తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా తన దక్కాల్సిన అంగన్వాడీ కార్యకర్త పోస్టు దక్కలేదని అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.