ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా బాధ్యతలు స్వీకరించాలి – ఎంపిడిఓ శ్రీకృష్ణ

ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించాలని పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు.

జిల్లా , మండల పరిషత్ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం మరియు బాధ్యత స్వీకరణ కార్యక్రమం నియమావళిని ఉల్లంఘించాకుండా నిర్వహించేందుకు అందరూ సహాకారించాలని ఒక ప్రకటన కోరారు