కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికై సమీక్ష సమావేశం

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికై మండల పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రోజుకు రోజుకు పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం నాడు మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు అధ్యక్షతనతో నగర పంచాయితీ పరిధిలో ఉన్న 8 సచివాలయల సిబ్బంది మరియు ఎయన్ఎం లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ మాట్లాడుతూ
సచివాలయం సిబ్బంది జాబ్ చార్ట్ ప్రకారం పని చెయ్యాలని పాజిటివ్ కేసులు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు చర్యలు గురించి వివరించారు.

కోవిడ్ కేసుల దృష్ట్యా సమీక్ష సమావేశాలు నిర్వహించేది లేదని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉన్నత అధికారులు సూచనలతో పని చెయ్యాలని విధుల్లో అలసత్వం వహిస్తే ‌చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి యస్ఐ సురేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతీరావు, నగర‌ పంచాయతీ అసిస్టెంట్ ఇంజనీర్ రవీంద్రుడు మరియు నగర పంచాయితీ పరిధిలోని సచివాలయల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు