పట్టణంలో నేడు 7 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కోవిడ్ పాజిటివ్ కేసుల జాబితా నందు పొదిలి పట్టణం చెందిన 7 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ప్రస్తుతం ఈ ఏడు కేసులను కలుపుకొని మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 43 కు చేరింది.
పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసుల దృష్ట్యా వర్తక వాణిజ్య సంస్థలను నేటి నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు

అదే విధంగా ‌45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి వ్యాక్సిన్ ప్రక్రియ లో పాల్గొన్నలని సామాజిక దూరం పాటిస్తూ తప్పని సరిగా మాస్క్ ధరించాలని పొదిలి టైమ్స్ విజ్ఞప్తి చేస్తుంది.