కోవిడ్ వ్యాక్సిన్ పట్ల విశేష స్పందన

కోవిడ్ వ్యాక్సిన్ పట్ల విశేష స్పందన ప్రజలు నుంచి లభిస్తుంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్థానిక పొదిలి నగర పంచాయితీ కార్యాలయం నందు వ్యాక్సిన్ ప్రక్రియ లో వందలాది మంది పాల్గొన్నారు.

పట్టణంలో గత నెల రోజులుగా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రజలు స్వల్పంగా ప్రజలు పాల్గొన్నగా ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ పట్ల సానుకూలంగా స్పందించి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి వ్యాక్సిన్ ప్రక్రియ లో పాల్గొంటున్నాగా ప్రజా స్పందనకు తగ్గట్టుగా వ్యాక్సిన్ ను ప్రభుత్వం సరఫరా చేస్తుంది.ఈ కార్యక్రమంలో ఉప్పలపాడు ప్రభుత్వం వైద్య అధికారిణి షేక్ షాహీదా, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నారు శ్రీనివాసులు రెడ్డి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు