యస్ బి ఐ బిఎస్ఎన్ఎల్ సబ్ రిజిస్టర్ కార్యాలయలను సందర్శించిన సిఐ సుధాకర్

సామాజిక దూరం కూడిన క్యూ ఏర్పాటుకై చర్యలు

లబ్దిదారులకు టోకెన్లు పంపిణీ చేసి పౌర సేవలను అందించాలని సిఐ సుధాకర్ ఆదేశాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బిఎస్ఎన్ఎల్ కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలను పొదిలి సిఐ సుధాకర్ రావు సందర్శించారు.

వివరాల్లోకి వెళితే బుధవారం నాడు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడి ఉన్న దృశ్యాలను చూసి ఖాతాదారులను సామాజిక దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి అక్కడ ఉన్న ఖాతాదారులను సామాజిక ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు.

తదుపరి ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనుసంధానం కోసం బి యస్ యన్ యల్ కార్యాలయం వద్ద వందలాది మంది ఉండటం తో బిఎస్ఎన్ఎల్ అధికారులతో మాట్లాడి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ టోకెన్లు పంపిణీ చేయించారు

అక్కడి నుంచి రద్దీగా ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చేరుకొని సబ్ రిజిస్టర్ తో కార్యాలయం లోపల గుంపులు గుంపులుగా ఉండకుండా బయటికి పంపించి రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి టోకెన్లు పంపిణీ చేసి రిజిస్ట్రేషన్లు జరపాలని కార్యాలయం బయట శానిటైజర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాలు పర్యటించి హోటల్స్ యాజమానులుకు కేవలం పార్సిల్ మాత్రమే అమ్మకాలు జరపాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.