పశ్చిమ ప్రకాశం అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని మంత్రి పెద్దిరెడ్డికి సర్పంచ్ సుధాకర్ రెడ్డి వినతి
అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జువ్వలేరు గ్రామ పంచాయితీ సర్పంచ్ శనగల సుధాకర్ రెడ్డి కోరారు.
వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్వచ్చ శంఖారావం సర్పంచ్ లతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ముఖాముఖి కార్యక్రమం వెబ్ యక్స్ సామాజిక మాధ్యమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ లతో సమావేశం నిర్వహించి జిల్లాకు ఇద్దరి చొప్పున సర్పంచ్ లతో మంత్రి తో మాట్లాడేందుకు అవకాశం కల్పించాగా మన జిల్లాలో ఇద్దరు ఎంపిక కాగా వారిలో పొదిలి మండలం జువ్వలేరు సర్పంచ్ శనగల సుధాకర్ రెడ్డి అవకాశం దక్కింది.
ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరం నుంచి జువ్వలేరు సర్పంచ్ శనగల సుధాకర్ రెడ్డి మంత్రి తో పశ్చిమ ప్రకాశం వెనుకబాటు గురించి నిధులు మంజూరు చేయాలని కోరారు
పిన్న వయసులోనే సర్పంచ్ గా ఏకగ్రీవ ఎన్నిక పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు