ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం : తహశీల్దారు హనుమంతరావు హెచ్చరిక
పొదిలి మండలం పరిధిలో ఎవరైనా ప్రభుత్వం భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహశీల్దారు హనుమంతరావు తెలిపారు.
సోమవారం నాడు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయంలో తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఇటివల కాలంలో మండల పరిధిలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో , పత్రికలో వార్త కథనాలు వస్తున్నాయి వాటి కఠిన చర్యలు తీసుకుంటామని అదే విధంగా మండల పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తనను కలవాలని తెలిపారు.