లీజు నగదు చెల్లింపులు చెయ్యని మున్సిపల్ షాపులు సీజ్
పొదిలి నగర పంచాయితీ పరిధిలో లీజు నగదు చెల్లింపులు చెయ్యని మున్సిపల్ షాపులను నగర పంచాయతీ అధికారులు సీజ్ చేశారు.
వివరాల్లోకి వెళితే పొదిలి నగర పంచాయితీ పరిధిలో మొత్తం 10 షాపుల పాటదారులు సంబంధించిన
లీజు నగదు చెల్లింపులు చేయకపోవడం వారికి 15 రోజుల క్రితం నోటీసులు జారీ చేసినా వారి నుంచి స్పందన లేకపోవడం మంగళవారం నాడు నగర పంచాయితీ అధికారులు స్ధానిక పెద్ద బస్టాండ్ లోని లీజు చెల్లించని షాపులను సీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయితీ శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు