అక్రమ లే ఔట్లు యాజమానులు పై కేసులు నమోదు చేస్తాం: నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్

ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఉడా) అనుమతులు లేకుండా లే ఔట్లు వేస్తే యాజమానులు పై కేసులు నమోదు చేస్తామని పొదిలి నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ మంగళవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.

వివరాల్లోకి వెళితే పొదిలి నగర పంచాయితీ పరిధిలోని మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద ఉన్న కంభాలపాడు గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 82 నందు అక్రమంగా వేసినా లే ఔట్లు ను మంగళవారం నాడు నగర పంచాయితీ సిబ్బంది తొలగించారు.

పొదిలి నగర పంచాయితీ పరిధిలో
లే ఔట్లు వేసే ‌వారు ఖచ్చితంగా మున్సిపల్ మరియు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఉడా) అనుమతులు తీసుకోవాలని లేకపోతే చర్యలు తప్పవని పట్టణంలో మరి ఎక్కడైనా అక్రమ లే ఔట్లు ఉంటే తమ దృష్టికి తీసుకొని వస్తే చర్యలు తీసుకుంటామని కమీషనర్ భవాని ప్రసాద్ తెలిపారు.

పొదిలి నగర పంచాయితీ పరిధిలో అపార్ట్మెంట్ ల్లో ప్లాట్లు , లే ఔట్లు లో ప్లాట్లు కొనుగోలు చెయ్యాలని అనుకొనే వారు ప్రజల సౌకర్యార్థం ప్రతి సోమవారం నాడు టౌన్ ప్లానింగ్ విభాగం నందు ఓపెన్ ఫోరం నిర్వహించబడును అని కావున ప్రజలు నగర పంచాయితీ కార్యాలయం నందు సంప్రదించి లే ఔట్లు మరియు ప్లాట్లు అనుమతుల గురించి తెలుసుకొని కొనుగోలు చెయ్యాలని కమీషనర్ భవాని ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు