తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన

కోవిడ్ తో మృతి చెందిన వారికి 10 లక్షాల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం వద్ద తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే తెలుగు దేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం నాడు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి అనంతరం తహశీల్దార్ హనుమంతరావు కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోవిడ్ తో మృతి చెందిన వారికి 10 లక్షాల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, అంత్యక్రియలకు 15 వేల రూపాయల నగదు ఇవ్వాలని, ఆక్సిజన్ లేక మృతి చెందిన వారికి 25 లక్షల రూపాయలు, కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్టులకు
25 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ మైనారిటీ విభాగం ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు షేక్ రసూల్ , పొదిలి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, విద్యార్థి విభాగం ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్, మండల పార్టీ నాయకులు పండు అనీల్ సయ్యద్ ఇమాంసా, యస్ఎం భాషా, జ్యోతి మల్లి, నరసింహారావు, కాటూరి శ్రీను , వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు