కరోనా బాధిత కుటుంబాలకు కేంద్ర ఆర్థిక చేయుత: ఎంపిడిఓ శ్రీకృష్ణ

కరోనా వైరస్ తో మరణించిన బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
ఆర్థిక చేయుత ఇవ్వడం జరుగుతుందని పొదిలి మండల‌ పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ అన్నారు.

కరోనా తో మృతి చెంది ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన బిసి కుటుంబాలకు జాతీయ ‌వెనుకబడిన తరగతుల ఆర్థిక మరియు అభివృద్ధి సంస్థ (NBCFDC) ద్వారా 5 లక్షల రూపాయల రుణం మంజూరు చేస్తారని అందులో 2 లక్షల రూపాయలు రాయితీ వస్తుందని సంబంధించిన పూర్తి వివరాలు గ్రామ సచివాలయం నందు పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని కోరారు.