కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ వామపక్షాల పార్టీలు ఆధ్వర్యంలో ధర్నా

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ వామపక్షాల పార్టీలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

వివరాల్లోకి శుక్రవారం నాడు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం వద్ద సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు

ఈ సందర్భంగా సిపిఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్ మాట్లాడుతూ నెల రోజుల్లో 24 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం
ద్వారా నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు పెరిగాయని అన్నారు.

సిపిఐ మండల కార్యదర్శి కె‌ వి రత్నం మాట్లాడుతూ లాక్ డౌన్ సమయం లో ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు బ్యాంకు ఖాతా జామ చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తిరిపాలు , బ్రహ్మం, వెంకటేశ్వరరెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు