కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వినతుల వెల్లువ

నగర పంచాయతీ నుంచి మాదాలవారిపాలెం తొలగించాలని

98 డియస్సీ లో అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు కల్పించాలని

విలేకరుల ఇంటి నివేశన స్థలాలు మంజూరు చేయాలని

పంచాయతీ నుంచి 12లక్షల రూపాయలు పెన్షన్ స్కీమ్ నగదు చెల్లింపులు చెయ్యాలని

పలువురు పలు రకాలుగా సమస్యలను ‌
కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చిన ప్రజలు

ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బుధవారం నాడు పొదిలి మండలం ‌పర్యాటనలో భాగం స్థానిక నగర పంచాయితీ 15 వార్డు మాదాలవారిపాలెం నందు జిల్లా కలెక్టర్ దృష్టికి స్థానిక మాదాలవారిపాలెం చెందిన మహిళలు తమ గ్రామం నగర పంచాయితీ ఉండటం వలన తమకు ఉపాధి హామీ పథకం అవకాశాలు కోల్పోతున్నామని కావున నగర పంచాయితీ నుంచి తొలగించాలని వినతి పత్రాన్ని అందజేశారు.


98 డియస్సీ నందు అర్హత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు

గత 15 సంవత్సరాల నుంచి విలేకరుల ఇంటి నివేశన స్థలాలు మంజూరు చేయాలని కోరుతున్నా పట్టించుకోవటం లేదని తాము కు ఇంటి నివేశన స్థలాలు మంజూరు చేయాలని కోరారు.

పొదిలి గ్రామ పంచాయతీ నందు పదవీవిరమణ చేసిన ముల్లా జిలానీ తనకు 12 లక్షల రూపాయిలు పెన్షన్ బకాయిలు రావాలని వినతి పత్రాన్ని అందజేశారు.

అదేవిధంగా పలువురు పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వినతి పత్రాలను పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు