పొదిలి లో వాలంటీర్ ప్రేమ వివాహం

ప్రకాశం జిల్లా యస్పీ మలికా గార్గ్ ఆదేశాల వాలంటీర్ ప్రేమ వివాహాన్ని స్థానిక పొదిలి పెద్ద మసీదు నందు నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే పొదిలి నగర పంచాయితీ పరిధిలోని ఐదో సచివాలయంలో వాలంటీర్ గా పని చేస్తున్న అరీఫా స్థానిక పడమటి పాలెం చెందిన షేక్ ఇమ్రాన్ తో ప్రేమలో ఉండగా పెళ్లి చేసుకొనేందుకు సుముఖత చూపకపోవడంతో ప్రకాశం జిల్లా యస్పీ మలికా గార్గ్ కలిసి ఫిర్యాదు చెయ్యడంతో సంబంధించిన కేసును పొదిలి యస్ఐ శ్రీహరి బదిలీ చేయ్యగా పొదిలి పోలీసులు సదరు యువకుడుని పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వటం తో పెళ్ళికి అంగీకారం తెలపటంతో స్థానిక పొదిలి పెద్ద మసీదు నందు పెద్ద మనుషుల సమక్షంలో ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి (నిఖా) నిర్వహించారు.

వాలంటీర్ ప్రేమ వ్యవహారం పెళ్లి తో సుఖాంతం అయ్యింది