నూతన డ్రైనేజీ వ్యవస్థకు మాస్టర్ ప్లాన్ సిద్ధం : మున్సిపల్ రీజనల్ డైరెక్టర్

పొదిలి నగర పంచాయితీ నందు నూతన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ గొట్టిపాటి శ్రీనివాసులు తెలిపారు. పొదిలి నగర పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ ఇంటి పనులకు సంబంధించిన డిమాండ్ నోటీసులను పలు రికార్డులను పరిశీలించారు

అనంతరం నగర పంచాయతీ కార్యాలయా అధికారులను నగర పంచాయతీ అభివృద్ధి కొరకు చేస్తున్నా కార్యక్రమాలను అడిగి తెలుసుకొని పలు సూచనలను చేశారు.

అనంతరం నగర పంచాయితీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రీజనల్ డైరెక్టర్ గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ
పొదిలి పంచాయతీ నుండి నగర పంచాయతీ కి మారిన తరుణంలో మంచినీరు శానిటేషన్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని త్వరలో పొదిలి నగర పంచాయతీ పరిధిలో మెరుగైన సేవలు అందిస్తామని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంటి పన్నులు చెల్లించలని, చెత్తను పడ వేసే సందర్భంలో నగర పంచాయతీ వారు సరఫరా చేసిన మూడు బుట్టలను ఉపయోగించుకొని తడి చెత్తను ఆకుపచ్చ బుట్టలో పొడి చెత్తను బులుగు రంగు బుట్టలో ప్రమాదకరమైన చెత్తను ఎరుపు రంగు బుట్టలో వేసి గ్రీన్ అంబాసిడర్ కి అందజేసి ప్రమాద రహిత సమాజాన్ని ప్రతి ఒక్కరు నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసఫ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.