చెత్త సేకరణ రిక్షాలు పంపిణీ చేసిన డిపిఓ నారాయణ రెడ్డి

చెత్త సేకరణ రిక్షాలను ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారి జివి నారాయణరెడ్డి పంపిణీ చేశారు.

వివరాల్లోకి జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమంలో భాగంగా పొదిలి మండల పరిషత్ కార్యాలయాన్ని శుక్రవారం నాడు సందర్శించి స్వచ్చ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ నుంచి వచ్చిన చెత్త సేకరణ రిక్షాలను గ్రామ పంచాయతీల వారిగా పంపిణీ చేశారు.

అనంతరం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి జి వి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటి నుండి సేకరించిన చెత్తను వీధుల వెంట, రోడ్ల ప్రక్కన వేయకుండా, యస్ ఎస్ డబ్ల్యూ పిసి షెడ్ దగ్గరకు మాత్రమే చెత్తను వేసేలా, షెడ్ లేని గ్రామాలలో గ్రీన్ మ్యాట్ తో తాత్కాలికంగా ఏర్పాట్లు చేసిన చోట మాత్రమే చెత్తను వేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

గ్రామాల పారిశుధ్య విషయంలో ఏదైనా అలసత్వం వహించిన యెడల సదరు పంచాయతీ కార్యదర్శి ఈఓఆర్డీల పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎస్ డబ్ల్యూ పిసి షెడ్ లకు రోడ్డు, కరెంటు, నీటి వసతులు సమకూర్చుకోవాలని , గ్రామాలలో పారిశుద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, మరమ్మత్తులు, నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ఎస్ డబ్ల్యూ పిసి లు పూర్తి స్థాయిలో వాడుకలోకి వస్తేనే గ్రామాలన్నీ వ్యర్ధ రహితంగా, ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ ఈఓఆర్డీ రాజశేఖర్ మరియు మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు వివిధ గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు