పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు‌ విద్యుత్ చార్జీలు తగ్గించాలని ధర్నా

పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు, విద్యుత్ చార్జీలు పెంచటం ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నాయని సిపిఎం పశ్చిమ ప్రకాశంజిల్లా కార్యదర్శివర్గసభ్యులు యం రమేష్ అన్నారు.

మంగళవారం నాడు స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద విద్యుత్ చార్జీలు పెంపుదల,అధిక ధరలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

ఈ సంధర్భంగా రమేష్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు పోటిపడి ప్రజలపై భారాలు మోపుతూ పేదల జీవితాలను ఛిద్రం చేస్తున్నారన్నారు.

పెట్రోల్,డీజిల్ రేట్లను పదిహేను రోజుల్లో 13సార్లు పెంచి 9రూపాయలు పెంచారని ఫలితంగా అన్ని రకాల నిత్యావసర సరుకులు,రవాణా చార్జీలు పెరగనున్నాయిని కరోనాతో కుదేలయింది పేదల జీవితాలపై గ్యాస్ రేట్లు, విద్యుత్ చార్జీలు పెంపు గోరుచుట్టుపై రోకటి పోటులా తయారయిందన్నారు.

300యూనిట్లు వాడే వారిని పేదలు గుర్తిస్తున్నందున వారిపై చార్జీల భారాన్ని తగ్గించాలని బారాలు ఇలాగే కొనసాగితే ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.

ఈ నిరసనలో కార్యక్రమంలో సిపియం నాయకులు కె శేషయ్య,డి నరసయ్య, కె ప్రసాద్,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.