విద్యుత్ కోతలు.. అల్లాడుతున్న ప్రజలు

గత కొద్దిరోజులుగా పొదిలి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి కొనసాగుతున్న విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు.

ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు విద్యుత్ లేకపోవడంతో వృద్దులు, చిన్నారుల పరిస్దితి దారుణంగా వుంది. పల్లెల్లో మూడువిడతలుగా ఏడుగంటలు, పట్టణాల్లో రెండు విడతలుగా రెండు నుంచి నాలుగు గంటలు అనధికార విద్యుత్ కోత విధిస్తున్నారు.

ఒకవైపు మండుతున్న ఎండలకు తోడు అప్రకటిత విద్యుత్ కోతలపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటిపైన శాఖాపరమైన అధికారులను అడిగినప్పటికీ వారు సరైన సమాధానమివ్వడం లేదని ప్రజలు ఆరోపిస్తున్పారు.

ఇప్పటికైనా విద్యుత్ కోతల సమాచారాన్ని ప్రజలకు ముందుస్తు సమాచారం అందించి విద్యుత్ సరఫరా నిలిపి వేయాలని ప్రజలు కోరుతున్నారు.