భగవద్గీత ను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి:

అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు సోమ్ ప్రకాశ్ యాదవ్ డిమాండ్

జాతీయ గ్రంథంగా భగవద్గీత ను ప్రకటించాలని అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు సోమ్ ప్రకాశ్ యాదవ్ డిమాండ్ చేశారు.

రాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం నాడు స్థానిక టైమ్స్ మీడియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అఖిల భారత యాదవ మహాసభ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో 1800 వందల గ్రామాల్లో గ్రామ కమిటీలు మరియు మండల కమిటీలు పూర్తి చేసి నూతన జిల్లాల ప్రాతిపాదికన 26 జిల్లాల్లో యాదవ మహాసభ కమిటీలు అనంతరం రాష్ట్ర కమిటీ నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు.


దేశవ్యాప్తంగా కుల గణన, దామాషా ప్రకారం రిజర్వేషన్, యాదవ రెజిమెంట్, పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామాల్లో సామాజిక అడవుల పెంపకం, పశు పోరంబోకు భూములు సంరక్షణ, భగవద్గీత ను జాతీయ గ్రంథంగా ప్రకటించాలనే పలు డిమాండ్లను సాధన దిశగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలిపారు

ఈ కార్యక్రమంలో యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోట్ల రామారావు, రాష్ట్ర కార్యదర్శి, ఆంజనేయ మూర్తి, జిల్లా నాయకులు మూరబోయిన బాబురావు యాదవ్, వెంకటేశ్వర్లు, పొదిలి రాజ్యలక్ష్మి, కనకం వెంకట్రావు యాదవ్ యేటి ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.