ఆరోగ్యన్ని కాపాడే జిమ్ ఈ రోజు ప్రాణాలు తీస్తున్నాయి…

ఇటివల కొంతమంది ప్రముఖులు హఠాన్మరణానికి కారణం జిమ్ గా భావిస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లా లో ఒక పొలీస్ కానిస్టేబుల్ జిమ్ కు పొయివచ్చి మరణించిన సంఘటన పొలీసులలో చర్చనీయాంశమైంది.

ప్రకాశంజిల్లా మర్రిపూడి పొలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శివరామకృష్ణ గౌడ్  ఈ రోజు ఉదయం గుండెపొటుతో మృతి చెందాడు.

ఆరోగ్యంపట్ల అత్యంత జాగ్రత్తగా ఉండే శివ ప్రతి రోజు మాదిరిగానే జిమ్ కు వెళ్ళి ఇంటికి వచ్చాడు..కొద్దిగా గుండెళ్ళో నొప్పిగా ఉందని ఇంట్లోవారికి చెప్పడంతో వెమ్మటే పొదిలి ప్రభుత్వవైద్య శాలకు తరలించారు.

డాక్టర్లు ‌వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో శివ మృతిచెందాడు. డాక్టర్లు వారిశాయశక్తుల ప్రయత్నించినా కాపాడలేక పొయ్యారు.

వ్యాయామం అతిగా చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు అభిప్రాయపడ్డారు.

యుక్త వయస్సు లో కానిస్టేబుల్ చనిపొవడంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపొయింది.

విషయం తెలుసుకున్న పొదిలి సిఐ సుధాకర్, సర్కిల్ పరిధిలోని ఎస్సైలు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు.

పొదిలి పట్టణంలో ఉన్నత విద్య అభ్యసించి శివ తొలిత హోం గార్డ్ గా విధుల్లోకి చేరి తదుపరి 2011 సంవత్సరం పోలీసు కానిస్టేబుల్ గా ఎంపిక పొదిలి సర్కిల్ పరిధిలోని మర్రిపూడి,పొదిలి,కొనకనమీట్ల పోలీసు స్టేషన్ నందు పని చేసే క్రమంలో శివ ప్రతిభా ను గుర్తించిన ఉన్నత అధికారులు సర్కిల్ పరిధిలోని ఐడి పార్టీ టీం నియమించారు.

పొదిలి బాప్టిస్ట్ పాలెం యువకుడు నైజీరియా ముఠా చేతి లో లక్షలాది రూపాయలు మోసం పోయిన కేసులో శివా తన తోటి మిత్రులు తో కలిసి డిల్లీ లో మకాం వేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నైజీరియా ముఠా ను అత్యంత చాకచక్యంగా వ్యవహరించి పట్టుకొని పొదిలి తీసుకొని వచ్చిన కేసులో శివా కు ఉత్తమ పురస్కారం జిల్లా యస్పీ చేతుల మీదుగా అందుకోగా డిజిపి చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం అందుకున్నారు.

అనేక కేసుల్లో ముద్దాయిలను అరెస్టు చెయ్యడంలో కీలక పాత్ర పోషించిస్తూ ఉన్నత అధికారుల నుంచి రివార్డులను అవార్డులను అందుకోనున్నారు.

కానిస్టేబుల్ హఠాన్మరణం చర్చనీయాంశమంగా మారింది.