కుల దూషణ నిషేధం హర్షం వ్యక్తం చేసిన నాయీ బ్రాహ్మణ సంఘం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
నాయీ బ్రాహ్మణల పై కొనసాగుతున్న కులదూషణను నిషేధిస్తు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందుకు ప్రభుత్వానికి పొదిలి నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు టి.సి.హెచ్ రంగయ్య యం.వి.నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
గురువారం పొదిలిలోని శ్రీసాయి హై స్కూల్ లో జరిగిన సమావేశంలో పలువురు సంఘ నాయకులు ప్రసంగించారు. ఇక నుండి ఎవరైనా మంగలి , మంగళోడు , మంగలది , బొచ్చుగొరిగేవాడా . కొండ మంగలి లాంటి పదాలతో వ్యక్తులుగాని , కుటుంబాలనుగాని , బహిరంగంగాగాని , ప్రక్కవ్యక్తులతోగాని వారి వారి మనోభావాలు దెబ్బతినేవిధంగా కులాలు వృత్తులను అవమానప్రరిచే విధంగా పిలిచినా ,
మాట్లాడిన , తోటి వ్యక్తులతో ఈ పదాలతో సంబాషించిన ఇక, పై చట్టప్రకారం అవమానించిన వారు ఎవరైనా ఇండియన్ పీనల్ కోడ్ 1968 ప్రకారం చట్టపరమైన చర్యలు ఎదుర్కొనవలసి వస్తుందని ఎవరు పై పదాలతో సామెతలు కూడా వేయరాదు అని ఆలా వేసిన శిక్ష కు బాధ్యలు అవవుతారని GO ms no 50 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .
ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ సంఘాo నాయుకులు హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో రాయపాటి సాయిబాబు, దర్శి వెంకట్రావు, దర్శి శివాజీ, బుసరిపల్లి శ్రీను, ఇర్లపాటి ఆదినారాయణ, ఈర్లపాటి హనుమంతరావు, ఇర్లపాటి రత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.