అక్రమ లేఔట్లు పై చర్యలు:డి యల్ పి ఓ కృష్ణమోహన్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

అక్రమ లేఔట్లు పై చర్యలు తీసుకోవాలని కనిగిరి డివిజన్ పంచాయతీ అధికారి కృష్ణమోహన్ అన్నారు.

వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు పొదిలి కొనకనమిట్ల,మర్రిపూడి,దరిశి దొనకొండ, కురిచేడు మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీ పాలన పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా హాజరైన కనిగిరి డివిజన్ పంచాయతీ అధికారి కృష్ణమోహన్ మాట్లాడుతూ వందశాతం ఇంటి పన్నులు వసూలు లక్ష్యం, అక్రమ లేఔట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని , పారిశుద్ధ్య పనులు సరిగా నిర్వహించాలని, మంచినీటి సరఫరా చెయ్యాలని , ఉపాధి హామీ పథకం పనులు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లింపులు మొదలైన కార్యక్రమాలను నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులకు తెలిపారు

ఈ కార్యక్రమంలో పొదిలి ఎంపిడిఓ శ్రీకృష్ణ కొనకనమిట్ల ఎంపిడిఓ జనార్ధన్, ఈఓఆర్డీ రాజశేఖర్, పొదిలి,కొనకనమిట్ల,మర్రిపూడి, దొనకొండ, కురిచేడు,దరిశి మండలాలకు చెందిన ఎంపిడిఓలు ఈఓఆర్డీ లు మరియు పంచాయితీ కార్యదర్శి లు తదితరులు పాల్గొన్నారు