మురళి కృష్ణ యాదవ్ పాదయాత్ర సంఘీభావం తెలిపిన ఎంఎల్ఏ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

కొనకనమిట్ల మండల పరిషత్ అధ్యక్షులు మూరబోయిన మురళి కృష్ణ యాదవ్ పాదయాత్ర కు మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి సంఘీభావం తెలిపి బృందం సభ్యులకు శాలువా కప్పి సత్కరించారు.

చిన్న అరికట్ల నుంచి తిరుమల వరకు తలపెట్టిన పాదయాత్ర నాలుగో రోజుకు చేరుకుంది.

నాలుగో రోజు పాదయాత్ర లో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొని సంఘీభావం ప్రకటించి కలియుగ ప్రత్యక్ష దైవం ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి,కొనకనమిట్ల మండలాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు