విష జ్వరాల దృష్ట్యా నిమ్మవరం లో ప్రత్యేక వైద్య శిబిరం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండలం ఆముదలపల్లి పంచాయతీ పరిధిలోని నిమ్మవరం గ్రామ నందు శనివారం నాడు డాక్టర్ సుష్మా ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
మొత్తం గ్రామంలో ఇంటి ఇంటికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో ఐదుగురికి విష జ్వరాల ఉన్నట్లు గుర్తించి వారికి చికిత్స అందించడం జరిగిందన్ని ఒక ప్రకటన విడుదల చేశారు
గ్రామంలో సమావేశం నిర్వహించి దోమల పట్ల అప్రమత్తంగా ఉండి తమ నివాస ప్రదేశాలలో నీరు నిల్వ లేకుండా చూడాలని దోమల నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం సర్పంచ్ శిరిమల్లే శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పంచాయతీ నందు దోమల మందు మరియు దోమల పొగను వ్యాప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ శిరిమల్లె శ్రీనివాస్ యాదవ్ వైద్య ఆరోగ్య సిబ్బంది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు