చిన్న అరికట్ల గ్రామంలో బాదుడే- బాదుడు కార్యక్రమానికి విశేష స్పందన
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
చిన్న అరికట్ల గ్రామం నందు తెలుగు దేశం పార్టీ బిసి సెల్ జిల్లా కార్యదర్శి బరిగె బాలయ్య ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం కు విశేష స్పందన లభించింది.
స్థానిక చిన్న అరికట్ల గ్రామం నందు ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలపై రకరకాల పన్నుల రూపంలో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
గత ఎన్నికల ముందు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలను ప్రాధేయపడీ అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను, ఉద్యోగస్తులను, విద్యార్థులను రైతులను అన్ని వర్గాలు కులాల వారిని ఇబ్బంది పెడుతూ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.
ఇక్కడ వైసిపి నాయకులు ఎక్కడ ఈ ప్రాంతం లో భూమి కనబడిన వెంటనే బోర్డు పెట్టేస్తున్నారు అని కబ్జాదారుల గా మారి ప్రజలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు అని ప్రజలు ఇకనైనా కళ్ళు తెరచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకులకు బుద్ది చెప్పి తెలుగుదేశం పార్టీ ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ మాజీ మండల అధ్యక్షులు కనకం నరసింహారావు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చప్పిడి రామ లింగయ్య , చిన్న అరికట్ల గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకులు దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బిసి సెల్ అధ్యక్షులు రోసయ్య, పొదిలి మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ముల్లా ఖుద్దూస్, మాజీ జెడ్ పి టి సి కాటూరి పెదబాబు, ఒంగోలు పార్లమెంట్ కార్యదర్శి ఎర్రం రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్,రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిపుచ్చ నూతల గోపీనాథ్ చౌదరి, జిల్లా తెలుగు మహిళ షేక్ షెహనాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి, జ షేక్ గౌస్ బాషా,పొదిలి పట్టణ ప్రధాన కార్యదర్శి కాటూరి శ్రీనివాసులు,పొదిలి మండలం తెలుగు యువత పోపూరి నరేష్,క్లస్టర్ ఇంచార్జి కుందూరు కాశిరెడ్డి, జిల్లా తెలుగు యువత అంజిరెడ్డి, sc సెల్ నాయకులు ఠాగూర్,గార్లదిన్నె భాషపతి నాయుడు,గ్రామ నాయకులు బరిగే బాలయ్య మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు