హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం తెలుగుజాతికే తీరని అవమానం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
*విశ్వవిద్యాలయం నెలకొల్పి 36ఏళ్లు, దానికి ఎన్టీఆర్ పేరుపెట్టి 24ఏళ్లు.
*ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం తుగ్లక్ చర్య
*హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి
– పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు డిమాండ్
ఏపి హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం హేయమైన చర్య, మరో తుగ్లక్ నిర్ణయం పిచ్చి ముదిరింది రోకలి తలకు చుట్టండన్నట్లుగా పాలకుల దుశ్చర్యలు ఉన్నాయిని చూడబోతే జెఎన్ టియూకి జవహర్ లాల్ నెహ్రూ పేరు, అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎన్ జి రంగా పేరు, మహిళా విశ్వవిద్యాలయానికి పద్మావతి అమ్మవారి పేర్లు కూడా మార్చేట్లున్నారని పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపించారు.
బుధవారం నాడు స్థానిక పొదిలి మండల తెలుగు దేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలుగు దేశం పార్టీ నాయకులు మాట్లాడుతూతెలుగుజాతి శకపురుషుడు ఎన్టీఆర్. కుల,మతాలకు అతీతంగా అన్నివర్గాలకు ఆరాధ్యుడు అజాతశత్రువైన ఎన్టీఆర్ పేరు మార్చాలని ఏ ముఖ్యమంత్రి చేయని దుస్సాహసానికి జగన్మోహన్ రెడ్డి తెగించడం తెలుగుజాతికే తీరని అవమానం
ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యరంగంలో ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలకు నిదర్శనం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైద్యవిద్యా రంగాన్ని ఆధునీకరించి, అన్ని మెడికల్ కళాశాలలను ఒక గొడుగు కిందకు తేవాలన్న ఎన్టీఆర్ సత్సంకల్పానికి నిలువెత్తు సాక్ష్యం ఆయన కృషిని చరితార్ధం చేసేందుకే శ్రీ నారా చంద్రబాబు నాయుడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుపెట్టి గౌరవించారని ఈ విశ్వవిద్యాలయం నెలకొల్పి 36ఏళ్లు, దానికి ఎన్టీఆర్ పేరుపెట్టి 24ఏళ్లు అలాంటిది ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం గర్హనీయం, వైకాపా ప్రభుత్వ మరో తుగ్లక్ చర్య అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
తక్షణమే ఈ పేరుమార్పు నిర్ణయాన్ని ఉపసంహరించుకోని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు , మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్ , తెలుగు దేశం పార్టీ న్యాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి యస్ ఎం భాషా, తెలుగు దేశం పార్టీ పార్లమెంటు కమిటీ కార్యనిర్వహక కార్యదర్శి పొల్లా నరసింహ యాదవ్, కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, తెలుగు దేశం పార్టీ పార్లమెంటు మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్, తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ భాష, మండల,పట్టణ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, ముల్లా ఖూద్దుస్ మాజీ ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా, తెలుగు దేశం పార్టీ మైనారిటీ విభాగం మండల అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి శ్రీను జ్యోతి మల్లి నరసింహారావు, మమిళ్లపల్లి వెంకటేష్,రబ్బానీ, ఖాసిం, తెలుగు యువత మండల అధ్యక్షులు పోపురి నరేష్, తదితరులు పాల్గొన్నారు.