బియస్పీ విజయానికి పాటుపడాలి: నియోజకవర్గ సమన్వయకర్త
బహుజన సమాజ్ పార్టీ విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త పాటుపడాలని బహుజన సమాజ్ పార్టీ కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త కాకి ప్రసాద్ అన్నారు.
బహుజన సమాజ్ పార్టీ కొండేపి నియోజకవర్గ సమావేశం స్థానిక మర్రిపూడి మండలం గుండ్లసముద్రం గ్రామం నందు మర్రిపూడి మండల అధ్యక్షులు కామునూరి వీరాంజనేయులు అధ్యక్షతనతో జరిగిన సమీక్షా సమావేశం లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశం కు ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ సమన్వయకర్త కాకి ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించే అర్హత ప్రస్తుతం, గతం లో ఉన్న ఏ పార్టీ లకు లేదని, కేవలం బహుజన్ సమాజ్ పార్టీ కి మాత్రమే ఉందని, ఈ రాష్ట్రం లోని బహుజనుల కు మత మైనారిటీలకు, అగ్రవర్ణ పేదలకు మేలు జరుగుతుందని, రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కొండపి నుండి ఏనుగు గుర్తు పై గెలిచిన అభ్యర్ధి మాత్రమే అమరావతి అసెంబ్లీ కి వెళ్లేలా గ్రామ గ్రామాన పార్టీ ని నిర్మాణంకు కృషి చెయ్యాలని కోరినట్లు మండల పార్టీ అధ్యక్షులు కామునూరి వీరాంజనేయులు ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ సమావేశంలో పొన్నలూరు, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి, కొండపి మర్రిపూడి మండలాల అద్యక్షులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు