కేంద్ర మంత్రి చేతుల మీదుగా ఉత్తమ మున్సిపాలిటీ పురస్కారాన్ని అందుకున్న కమిషనర్

పొదిలి మున్సిపాలిటీ ఏర్పడి 20 నెలల్లోనే స్వచ్చ్ భారత్ మిషన్ క్రింద ఉత్తమ పురస్కారం అందుకొని సరికొత్త చరిత్రను తిరగరాసేంది

మేజర్ గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయితీ గా రూపొందిన తర్వాత పూర్తి స్థాయిలో మున్సిపల్ పాలనా వ్యవస్థ లోకి అడుగుపెట్టిన తర్వాత బాల అరిష్టాలు దాటుకొని అవసరానికి తగ్గట్టుగా
పారిశుద్ధ్య కార్మికులు లేకపోయినా మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్, శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు తమ దైన శైలిలో తమకు ఉన్న వనరులతో మున్సిపల్ పరిధిలోని శానిటేషన్ పనులు నిర్వహిస్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి జాతీయ అవార్డు కు ఎంపిక కావడం జరిగింది.

సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు కొత్త ఢిల్లీ నందు స్వచ్చ భారత్ మిషన్ అర్బన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 1850 కార్పొరేషన్, మున్సిపాలిటీలు లకు అవగాహన సదస్సు ను తలపెట్టారు.

రెండో రోజు సదస్సులో కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ చేతుల మీదుగా ఉత్తమ మున్సిపాలిటీ పురస్కారాన్ని పొదిలి మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ అందుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పొదిలి శానిటేషన్ సిబ్బందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

పొదిలి మున్సిపాలిటీ కి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతూ పొదిలి మున్సిపల్ అధికారులు తయారు చేసిన డిపిఆర్ అందజేయగా అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కమిషనర్ డానియల్ జోసప్ తెలిపారు