నీట మునిగిన వేలాది ఎకరాల భూములు ప్రభావ ప్రాంతాల్లో పర్యటించిన అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

తూఫాన్ ప్రభావ ప్రాంతాల్లో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో బృందం తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందాలు పంట నష్టపోయినా ప్రాంతాల్లో పర్యటించారు.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొనకనమిట్ల మండలం పరిధిలోని పాతపాడు గొట్లగట్టు నాయుడుపేట చినమనగుండం, నాగంపల్లి కాట్రగుంట గ్రామాల్లోని వేలాది ఎకరాల భూములు నీట మునిగి పోవటం వల్ల సుమారు 50 కోట్లు పైగా పెట్టుబడి నష్టం వాటిల్లింది ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధించిన విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు మూరబోయిన మురళి యాదవ్, జెడ్పీటీసీ సభ్యులు అక్కిదాసరి ఏడుకొండలు పాతపాడు గ్రామంలో పర్యటించి నీట మునిగినా పొలాలను, పలు నివాస గృహాలను పరిశీలించారు


తెలుగు దేశం పార్టీ నియోజకవర్గం ఇంన్చర్జ్ కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్, ఏఎంసి మాజీ ఛైర్మన్ చప్పిడి రామ లింగయ్య, మాజీ సర్పంచ్ దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి తో కూడిన ప్రతినిధి బృందం వర్షం ప్రభావం తో నీట మునిగినా పొలాలను పరిశీలించారు

పంట నష్టపోయినా రైతులను ఆదుకోవాలని తెలుగు దేశం పార్టీ ప్రతినిధి బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది