రాజకీయ పార్టీలు సహనం ఓర్పు తో వ్యవహారించాలి – సిఐ మల్లిఖార్జునరావు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి పోలీసు స్టేషన్ నందు శనివారం నాడు పొదిలి యస్ఐ కోటయ్య ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు తో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పొదిలి సిఐ మల్లిఖార్జునరావు మాట్లాడుతూ 13న జరిగిన ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగడానికి సహకరించిన అందరికీ ముందుగా పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేశారు.

జూన్ 4న జరుగు కౌంటింగ్ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు సమన్వయం పాటిస్తూ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తమ తమ కార్యకర్తలను నియంత్రణలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని, అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే వివిధ రకాల రెచ్చగొట్టే పోస్టులను మరియు వీడియోలను నమ్మవద్దని వాటి వలన ఏదైనా శాంతిభద్రతలకు భంగం కలిగి అవకాశం ఉంటే ఆ విషయాన్ని ముందుగా పోలీసు శాఖ వారికి తెలియజేయాలని కోరారు

అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ల పై కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లు మీ గ్రూపులో ఏదైనా శాంతిభద్రతలకు భంగం కలిగేలా ఉన్న పోస్టులు గానీ, రాజకీయ పార్టీల మనోభావలు దెబ్బతినే పోస్టులు గాని పెట్టినట్లయితే అట్టి పోస్టులను వెంటనే అడ్మిన్ డిలీట్ చేసి సంబంధించిన సమాచారాన్ని పోలీసు శాఖ వారికి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు