5వ రోజులకు చేరిన ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రిలే దీక్షలు

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి డిపోలో యాజమాన్యం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఏపీ పి టి డి ఎంప్లాయిస్ యూనియన్ తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరాయి.

ఐదో రోజు దీక్ష లో కుర్చున్న యు నరసింహారావు కండక్టర్ E No 626300 మరియు వై సాంబశివరావు డ్రైవర్ E No 626146 లకు రమాదేవి కె.వి.రావు లు పూలమాలలు వేసి దీక్ష కు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ డియం,ఎంప్లాయిస్ యూనియన్ నాయకులను తో చర్చలు జరిపి చాట్ లు వరకే నా పరిధిలో ఉన్నాయి మిగతావన్నీ ఆర్ఎం దృష్టికి తీసుకెళ్తానని చార్టులు వెంటనే వేస్తానని హామీ ఇచ్చరని మిగతా సమస్యల పరిష్కారం చేసేంత వరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామన్నారు.

అదనపు ఉద్యోగాల పేరుతో కనిగిరి డిపోకు రిలీవింగ్ పై పంపినటువంటి డ్రైవర్లను వెంటనే మాతృ డిపో కి తెప్పించి లీవ్ పొజిషన్ కల్పించాలని సకాలంలో ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్లు కలిపేలా చర్యలు తీసుకోవాలని డిస్పాచ్ మెకానిక్ కృష్ణ డ్రైవర్లపై పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నా అతనిపై చర్యలు తీసుకొని వెంటనే డిస్ప్యాచ్ మెకానిక్ ను వెంటనే మార్చాలని తెలిపినట్లు చెప్పారు

ఈ కార్యక్రమంలో పొదిలి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు