నన్ను రక్షించే వారే లేరా…..! ఓ వృక్ష వ్యధ….. వినేవారే లేరా…..! కనేవారే లేరా…..!

నన్ను రక్షించే వారే లేరా…..! వినేవారే లేరా…..! కనేవారే లేరా…..! ఇది వాక్యం కాదు సుమారు 150సంవత్సరాల వయస్సు కలిగిన ఓ వృక్షం యొక్క మనోవ్యధ. ఇంతకీ ఏమైంది అనేది అర్ధం కాలేదా అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే……….

పొదిలి పట్టణంలోని పెద్ద బస్టాండ్ సెంటర్ లో ఓ వృక్షం ఉంది దానికి ఓ చరిత్ర కూడా ఉంది…… సుమారు 150సంవత్సరాల క్రితం ఏ మహానుభావుడు నాటాడో కానీ ఆనాడు స్వాతంత్ర్య సమరయోధులకు, పుర ప్రజలకు నిస్వార్థంగా సేదతీరడానికి నీడనిచ్చి….. కాలుష్యాన్ని తనలో ఐక్యం చేసుకుని స్వచ్ఛమైన ప్రాణవాయువుని అందిస్తూ ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చి…… ఇప్పటికి వరకు ఎంతోమంది జీవనోపాధి నెలవుగా ఉన్న ఆ వృక్షం ఇప్పడు మనోవ్యధకు గురవుతుంది.

కారణం ఏంటో తెలుసా అన్న క్యాంటీన్….. అన్న క్యాంటీన్ ఏర్పాటు మంచి విషయమే కానీ……. దాని నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు కలిగించని ఆ వృక్షాన్ని తొలగించే అవసరం లేదు……. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసినా కూడా అక్కడ భోజనం చేసిన వారికి కూడా సేదతీరే అవకాశం ఉంటుంది….. అయితే ఇప్పుడు ఆ వృక్షాన్ని తొలగించే ఆలోచనతో అధికారులు ఉన్నారు.

మనుషులకు ప్రాణం ఉన్నట్లే చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా మన ఆరోగ్యాన్ని కాపాడే వృక్షాలను తొలగిస్తూ పోతే మనం పీల్చుకోవడానికి గాలి కూడా దొరకదు.

అయితే అర్ధం చేసుకుంటే ఆ వృక్షం యొక్క బాధ అందరికి అర్ధం అవుతుంది. సుమారు 150సంవత్సరాల నుండి ఉన్న వృక్షం ఇప్పుడు కాపాడమని వేడుకుంటుంది……. రక్షించమని ఆర్థిస్తుంది……. కాపాడే వారికోసం ఎదురుచూస్తుంది…… అక్కడే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు, ప్రయాణికులు ఈ విషయం తెలిసి చాలా బాధ పడుతున్నారు. మొన్నటి నుండి కొమ్మలు కొడుతున్నారు…. రేపు వృక్షాన్నే తొలగించాలని చూస్తున్నారు….. ఆ వృక్షం ఏం పాపం చేసింది…… ప్రజలకు ఆరోగ్యాన్నివ్వడానికి 150సంవత్సరాల నుండితనవంతు ప్రయత్నం చేయడమే పాపమా…..? అని ప్రశ్నిస్తున్నారు.

ఒక్కసారి ఆ స్థానంలో మనం ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో అర్ధం అవుతుంది……. మొక్కలను పెంచండి వృక్ష సంపదను కాపాడండి అని చెప్పే ప్రభుత్వం మాటలు మాటలకే పరిమితం అయ్యాయా?……. పర్యావరణ దినోత్సవమైన ఫిబ్రవరి28 ఒక్కరోజు ఒక్క మొక్క నాటి తర్వాత వాటి పరిస్థితి ఎలా ఉందో కూడా పట్టించుకోని వాళ్ళకి…… వృక్షాలను కాపాడుకోవడం ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ మహా వృక్షం మాత్రం అంత తనని కోసేస్తున్నా మౌనంగా భరిస్తుంది….. ఎందుకంటే మాటల్లో చెప్పలేదు కదా….. కానీ ఎలాగోలా తనని కాపాడే వారు వస్తారని వేచి చూస్తుంది కూడా.
దయచేసి ఆ వృక్షాన్ని కాపాడుకునే దిశగా మనమందరం నడుంబిగిద్దాం……. తొలగింపును అడ్డుకుని ఎంతో ఘన చరిత్ర కలిగిన ఆ వృక్షాన్ని కాపాడుకుందాం
వృక్షో రక్షతి రక్షతః

జైహింద్