ఉప్పలపాడు ప్రాధమిక పాఠశాలలో దాతల సహాయంతో డిజిటల్ క్లాసులకు శ్రీకారం

మండలంలోని ఉప్పలపాడు గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో డిజిటల్ క్లాసులను ఉత్తర అమెరికా తెలుగు పీపుల్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోమటి జయరాం ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే దాతలు సూర్యకిరణ్ తన విరాళంగా డిజిటల్ పరికరాలను అందించగా ముఖ్య అతిథిగా హాజరైన జయరాం మాట్లాడుతూ డిజిటల్ తరగతుల కొరకు ఈ పరికరాలను బహుకరించిన సూర్య కిరణ్ కు అభినందనలు తెలిపారు……. అలాగే మండలంలోని వివిధ పాఠశాలల్లో హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ద్వారా విద్యార్థులకు మంచినీటిని అందించేందుకు ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయించబోతున్న సాయి రాజేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు…… అలాగే దాతల సహకారంతో తాను కూడా ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఉచిత ఉచిత నిర్వహణ మరియు ఇంకా ఎక్కువ పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, జడ్పీటీసీ సాయి రాజేశ్వరరావు, ఎంఈఓ రఘురామయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.