సెక్టార్ ఎన్నికల అధికారులతో పోలీసులు సమన్వయంగా పనిచేయాలి : యస్పీ కోయ ప్రవీణ్

పోలీసులు సెక్టార్ ఎన్నికల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని ప్రకాశం జిల్లా సూపరెండెంట్ ఆఫ్ పోలీసు కోయ ప్రవీణ్ అన్నారు. వివరాల్లోకి వెళితే స్థానిక పొదిలి పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని శుక్రవారం రాత్రి సందర్శించిన ఆయన సంబంధించిన రికార్డుల పరిశీలించారు.

అనంతరం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఏర్పాట్లు కోసం రెవెన్యూ వారు ఏర్పాటు చేసిన సెక్టారు ఎన్నికల అధికారులతో పోలీసులు సమన్వయంగా పని చేసి పోలింగ్ బూత్ వారిగా వాటి యొక్క స్ధితిని గుర్తించి చెప్పట్టవలసిన చర్యలు గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఎన్నికల్లో బందోబస్తుకు కావలసిన ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటామని అదేవిధంగా ఎన్నికల్లో ముందస్తుగా తీసుకోవాలసిన జగ్రత్తలు గురించి సిబ్బందికి వివరించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి సిఐ చిన్నమీరా సాహెబ్, దొనకొండ, మర్రిపూడి, యస్ఐలు సుబ్బారావు, మాధవరావు, ట్రైనీ ఎస్ఐ భవాని తదితరులు పాల్గొన్నారు.