వైభవంగా రంజాన్ పండుగ

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు జరిపి పరస్పరం ఆలింగనం చేసుకొని ఈద్‌ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సమత, మమతల కలయిక, ధాన ధర్మాలకు ప్రతీకగా నిలిచేదే రంజాన్. ముస్లింలు నెలరోజులు పాటు కఠోమైన భక్తిశ్రద్ధలతో ఒక్కపొద్దులు ఉంటూ నెలవంక కనబడినరోజున రంజాన్ పండుగను జరుపుకుంటారు. దీనినే ఈద్ ఉల్ ఫితర్ అని కూడా ముస్లింలు చెప్పుకుంటారు. ఇందులో భాగంగా స్థానిక ఈద్గా మైదానంలో వేల సంఖ్యలో ముస్లింలు గుమికూడి ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా ఖురాన్‌లో బోధించిన అనేక సూక్తులను మతపెద్దలు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక యస్ఐ టి శ్రీరాం ఆద్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు