సర్పంచ్ రేసులో సామి పద్మావతి…

పొదిలి మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రేసులో సామి పద్మావతి

ఇంకొద్ది రోజులలో విడుదల కానున్న స్థానిక సంస్థలు ఎన్నికల షెడ్యూల్ దృష్టిలో ఉంచుకుని….. పొదిలి మేజర్ పంచాయతీ విషయంలో అటు వైకాపా ఇటు తెదేపాలు అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో తర్జనభర్జనలు పడుతున్న నేపథ్యంలో….. బిసి జనరల్ లేక ఓపెన్ కేటగిరి అయ్యే అవకాశం ఉండడంతో బిసి జనరల్ అయితే ఎవరిని ఎంపిక చేయాలి?….. లేక ఓపెన్ కేటగిరి అయితే ఎవరిని ఎంపిక చేయాలి?….. ఆర్ధిక స్థిరత్వం సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహ వంతులైన అభ్యర్థులను ఈసారి సర్పంచ్ రేసులో ఉండాలనే ఆలోచనలో ఇరు పార్టీ శ్రేణులు ఇప్పటికే తలమునకలై ఉన్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సామాజిక సేవా కార్యక్రమాలలో తన వంతుగా ముందుగా ఉండే సామి పద్మావతిని వైకాపా, తెదేపా నాయకులు సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

వైశ్య సామాజిక వర్గానికి చెందిన సామి పద్మావతి తన సొంత ఖర్చులతో సామాజిక సేవా కార్యక్రమాలలోనే కాకుండా దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలు కట్టించి ప్రజలలో తనకంటూ ఓ పేరును సంపాదించుకున్నారు….. అలాగే పేద పిల్లలకు విద్యాభ్యాసం కొరకు పిల్లలను దత్తత తీసుకుని విద్యాదాతగా కూడా మంచి పేరును సంపాదించుకున్నారు. అలాగే ఆర్ధికంగా కూడా ఒకింత స్థిరత్వం కలిగి ఉండడంతో పద్మావతి సర్పంచ్ పదవిని కైవసం చేసుకునే ఆలోచనతో ఆమెను వైకాపా, తెదేపా నాయకులు సంప్రదించడంతో ఆమె కూడా కొంత సానుకూలంగా స్పందించారని సమాచారం. ఓపెన్ కేటగిరీ అయితే ఆమె ఏ పార్టీ తరుపున పోటీ చేస్తారనే విషయం త్వరలోనే తెలియనుంది.