పినాకిని గ్రామీణ బ్యాంకు మాజీ డైరెక్టర్ వెన్నెల మృతి

పినాకిని గ్రామీణ బ్యాంకు మాజీ డైరెక్టర్ సినియార్ నాయకులు వెన్నెల వెంకటేశ్వరరావు(71)గుండె పోటుతో మృతిచెందారు. వివరాలు లోకి వెళితే గత కొంత కాలంగా అనారోగ్యంతో భాధ పడుతున్న వెన్నెల గుద్దేటివారివిధిలోని స్వగృహాంలో బుధవారం తెల్లవారుజమున మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.
పొదిలి పట్టణంలోని సీనియర్ నాయకుల్లో వెన్నేల ఒక్కరు తొలుత వెన్నల ప్రభుత్వం ఉద్యోగంలో చేరి అటుపిమ్మట్ట 1975లో సినిమా పరిశ్రమకి మద్రాసు చేరగా ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఎమర్జన్సీ విధించాటంతో కాంగ్రెస్ పార్టీ పై వ్యతిరేక భావం ఏర్పడి తన అనంతరం తన సహాచరులు మాజీ మంత్రి వెన్న వెంకట నారాయణ రెడ్డి తో జనతా పార్టీలో చేరి రాష్ట్ర నాయకులు తమ్మలపాటి సత్యనారాయణ మొదలైన సోషలిస్టు నాయకులు సన్నిహితంగా మెలిగారు 1982లో తెలుగు దేశం పార్టీ అవిర్బవంలో పార్టీలో చేరి కీలక పాత్ర వహించిన పిదప 1985లో దరిశి తెలుగు దేశం పార్టీ అభ్యర్థితత్వం ఖరారు అయ్యి చివరి నిమిషంలో మాజీ మంత్రి కాటూరి నారాయణ స్వామి ఒత్తిడి మేరకు చివరికి పార్టీ అధిష్టానం తలొగ్గి శ్రీరామలుకు టికెట్ కేటాయించిన ఆయన విజయంకు కృషి చేసారు తననంతరం 1987లో కొత్త మండల వ్యవస్థ ఏర్పడిన సమయంలో మండల అధ్యక్షులు పోటీ చెయ్యటంకు కాటూరి ఒత్తిడితో అవకాశం ఇవ్వలేక పొయ్యింది.
1983 పట్టుపరిశ్రమ కార్పొరేషన్ డైరెక్టర్గా 1987లో మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ అదే సమయంలో ఒక సంవత్సరం తెలుగు దేశం పార్టీ అధ్యక్షులుగా పని చేసారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు జిల్లాలో అత్యంత ముఖ్య అనుచరుడు అదేవిధంగా 1988లో రంగా హత్య నైపధ్యంలో పార్టీ లోనే ఉన్నారు 1989 ఎన్నికల్లో దరిశి తెదేపా టికెట్ కేటాయించాక పోవడంతో 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరి అనంతరం పినాకిని డైరెక్టర్ గా 12 సంవత్సరాల పాటు పని చేసారు ఆయన హాయంలోనే పొదిలి బ్యాంకును ఏర్పాటు చేసారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తో మంచి సంబంధలు కల్గిగి ఉండటం తో పిసిసి కార్యదర్శిగా నియమించారు.
2009 ఎన్నికల సమయంలో వైఎస్ అధికారంలోకి రాగానే శాసనమండలి సభ్యులుగా చేస్తానని హామీ ఇచ్చారు ఎన్నికల్లో విజయం సాధించిన కొన్ని రోజుల్లో వైఎస్ మృతితో రాజకీయలకి దూరంగా ఉన్నారు. వెన్నెలకు దర్శకుడు దాసరి సత్యనారాయణ దగ్గుబాటి వెంకటేశ్వరరావు నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో మాజీ మంత్రి వెన్నా వెంకట నారాయణ రెడ్డి మాజీ శాసనసభ్యలు ఇరిగినేని తిరుపతి నాయుడులతో సన్నిహితంగా మెలిగారు. ఆయన అంతిమ యాత్ర గురువారం జరుగుతుంది బంధువులు తెలిపారు