ఈఓఆర్డీగా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్…

పొదిలి మండల పంచాయతీరాజ్ విస్తరణ అధికారిగా కె రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు.

వివరాల్లోకి వెళితే బుధవారంనాడు మర్రిపూడి మండలం పంచాయతీరాజ్ విస్తరణ అధికారిగా పనిచేస్తున్న కె రాజశేఖర్ ను పొదిలి మండలానికి బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయగా గురువారంనాడు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న రంగనాయకులు బేస్తవారిపేట మండలం బదిలీపై వెళ్లారు.