“స్పందన” కార్యక్రమానికి 953అర్జీలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మొదటి రెండవ వారంల్లో కంటే స్పందన కార్యక్రమానికి ర
మూడో వారం ప్రజలు స్పందన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని రెవిన్యూ సిబ్బంది తెలిపారు.

వివరాల్లోకి వెళితే స్పందన కార్యక్రమం ద్వారా ప్రజాసమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పొదిలి మండల తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కౌంటర్ నందు ప్రజలు రేషన్ కార్డులు, పెన్షన్, గృహాలు, ఇంటి నివేశన స్థలాలు తదితరాలపై పలు రకాల అర్జీలను రెవిన్యూ సిబ్బందికి సమర్పించి రసీదులను పొందారు.

ఈ సందర్భంగా మొత్తం 953 అర్జీలు వచ్చాయని స్థలాల కోసం- 283 పెన్షన్ల కోసం- 375 గృహాల కోసం-115 రేషన్ కార్డుల కోసం -174 వచ్చాయని….. అర్జీలను ఆన్లైన్ నందు పరిశీలించి అర్హులైన వారికి సత్వర పరిష్కారం లభించేలా చేస్తామని రెవిన్యూ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు, తదితరులు, పాల్గొన్నారు.