కనుల పండుగగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణం

పట్టణంలోని స్థానిక వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణమహోత్సోవం కనుల పండుగగా జరిగింది.

కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనంతరం మాజీ శాసనసభ్యులు సానికొమ్ము పిచ్చిరెడ్డి సౌజన్యంతో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చి కళ్యాణమహోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు.