అయ్యోధ్య భూ వివాదంపై మధ్యవర్తిత్వ త్రిసభ్య కమిటి విఫలం : సుప్రీంకోర్టు ఆగష్టు 6న నుండి రోజువారి విచారణ

అయోధ్య రామమందిరం – బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ త్రిసభ్య కమిటీ విఫలమైందని సుప్రీంకోర్టు పేర్కొంది.

వివరాల్లోకి వెళితే అయోధ్య రామమందిరం వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో రిటైర్డ్ జస్టిస్ ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, న్యాయవాది శ్రీరామ్ పంచు లతో ఏర్పాటు చేసిన త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీకి ఇరువర్గాలతో మధ్యవర్తిత్వం జరిపి సమస్య పరిష్కారానికి నివేదిక అందించాలని ఆదేశిస్తూ జులై 25లోగా పూర్తి స్థాయిలో నివేదికను అందించాలని సూచించింది.

జులై 25కు త్రిసభ్యకమిటి నివేదిక పూర్తి కానందున అదనంగా కొంత సమయమిస్తూ ఆగస్టు 1లోగా అందజేయని పక్షంలో తిరిగి రాజ్యాంగ ధర్మాసనం తిరిగి విచారణ చేయడం జరుగుతుందని తెలిపింది….. కాగా ఆగస్టు 2న మధ్యవర్తిత్వ త్రిసభ్యకమిటీ నివేదికను సుప్రీంకోర్టులో అందజేయగా…. నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు త్రిసభ్యకమిటీ సమస్య పరిష్కారంలో పురోగతిని చూపించలేకపోయినందున మధ్యవర్తిత్వ త్రిసభ్యకమిటీని రద్దుచేస్తూ….. తిరిగి ఆగస్టు 6వతేది నుండి రాజ్యాంగ ధర్మాసనమే విచారణ చేపడుతున్నట్లు సుప్రీం పేర్కొంది.