పెద్దచెరువును పరిశీలించిన కుందూరు

పొదిలి పెద్దచెరువును ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి పరిశీలించారు.

పొదిలి పెద్దచెరువును సమ్మర్ స్టోరేజిగా మార్చేందుకు కావలసిన ప్రణాళికలో భాగంగా మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి స్థానిక పెద్దచెరువును పరిశీలించి నీటిపారుదల శాఖ డిప్యూటీ ఇంజనీర్ శివరామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీరెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ లు విశ్వనాథ్, రవిలతో సమ్మర్ స్టోరేజిగా మార్చేందుకు కావలసిన ప్రణాళికలు, అంచనాలు, వ్యయాలను రూపొందించాలని సూచించారు.

అనంతరం దర్శి మండలంలోని కొత్తరెడ్డిపాలెం సాగర్ కుడికాలువ నుండి నీటిని పైపులైన్ ద్వారా పెద్దచెరువుకు తెచ్చేందుకు గల సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించి కొత్తరెడ్డిపాలెం సాగర్ కుడికాలువ వరకు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.