స్టాప్ బోర్డును ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

పోలీసు స్టాప్ బోర్డును బైకు ఢీకొనడంతో బైకుపై వెనుక కూర్చున్న వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన మల్లవరం గ్రామ సమీపంలో బుధవారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే దర్శి మండలం లంకోజనపల్లి గ్రామానికి చెందిన శ్రీను, ఎద్దుల ప్రసాద్ అనే ఇద్దరు ద్విచక్రవాహనంపై మల్లవరం గ్రామానికి వచ్చి తిరుగు ప్రయాణంలో మల్లవరం గ్రామ సమీపంలో గల పవర్ సబ్ స్టేషన్ వద్ద రోడ్డుపై ఇటీవల రోడ్డు భద్రత దృష్ట్యా తీసి పక్కన పడవేసిన స్టాప్ బోర్డులను…. అనుమతి లేకుండా చేస్తున్న పనుల నిమిత్తం రోడ్డుపై ఏర్పాటు చేయడం వలన రోడ్డుపై ఉన్న కంకరను బైకు ఎక్కడంతో అదుపుతప్పి స్టాప్ బోర్డును ఢీకొనగా బైకు నడుపుతున్న శ్రీను రోడ్డు పక్కన పడిపోయి స్వల్ప గాయలుకాగా…. వెనుక కూర్చున్న ఎద్దుల ప్రసాద్ రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒగోలు తరలించారు.

స్థానికుల తెలిపిన వివరాల మేరకు….. ఇటీవల రోడ్డుపనుల నిమిత్తం ఏర్పాటు చేసిన స్టాప్ బోర్డులను పనులు అయిపోగానే పక్కన పడవేశారని ఇప్పుడు ఎందుకు పెట్టారో తెలియదు కాని… స్టాప్ బోర్డులను అకస్మాత్తుగా ఏర్పాటు చేయడం వలన ముగ్గురు పడిపోయారని కానీ వారికి గాయాలు కాకపోవడంతో వెళ్లిపోయారని….. బోర్డులపై రేడియం స్టిక్కర్ లేకపోవడంతో పని చేస్తున్న సంగతి తెలియక వెళ్తూ వెళ్తూ ఇలా ప్రమాదానికి గురయ్యారని ఆరోపించారు.