ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్

జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు .

వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు స్థానిక విశ్వనాథపురంలోని ఖాదర్ వలి కళ్యాణ మండపంలో కందుకూరు, మార్కాపురం రెవిన్యూ డివిజనల్ మండల ప్రత్యేక అధికారులతో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు చేరువ చేయడానికి తీసుకోవలసిన చర్యలపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువచేయడానికి గ్రామ, వార్డు వాలంటీర్లు
వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని….. జిల్లాలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడానికి భవనాలను సిద్ధం చేయాలని పంచాయతీ రాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. జిల్లాలో సాగర్ కాలువల ద్వారా వచ్చే నీటిని చెఱువులకు, త్రాగునీటి పధకాలకు వాడాలన్నారు. అవకాశం ఉండికూడా చెరువులను సాగర్ నీటితో నింపకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

జిల్లాలో పనిచేయని త్రాగునీటి పధకాలను పరిశీలించి మరమ్మత్తులకు అవసరమైన ప్రతిపాదనలు ఈ నెల 26వతేదీ లోగా తెలియజేయాలని సూచించారు.

జిల్లాలో అవసరమైన మేర నీటి నిల్వలు ఉన్నప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం మంచి పద్ధతికాదని ఆయన స్పష్టం చేస్తూ…… మండల స్థాయిలో ఉన్న త్రాగునీటి పధకాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు.

పంచాయతీ కార్యదర్శిలు గ్రామాల్లో అందుబాటులో ఉండడంలేదని పద్దతిలో మార్పు రాకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శిలు తప్పకుండా కార్యాలయ స్థానాల్లో కార్యాలయ పని వేళల్లో తప్పని సరిగా అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు.

గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిలు త్రాగునీరు, పారిశుద్ధ్యము కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని….. జిల్లాలోని ప్రజలకు త్రాగునీరు అందించడంలో నిర్లక్ష్యంవహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టాలని….. జిల్లాలో గ్రామ పంచాయితీలలోని ప్రధాన రహదారిపై ఉన్న షాపింగ్ మార్కెట్, మార్కెట్ల వద్ద చెత్తా చెదారం పడవేయకుండా ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

అలాగే గ్రామాల్లో సైడు కాల్వల పూడికతీత పనులు చేపట్టాలని…. జిల్లాలో గ్రామ వాలంటీర్లు వ్యవస్థ అందుబాటులో వచ్చిందన్నారు. గ్రామాల్లో వాలంటీర్ల ద్వారా బేస్ లైన్ సర్వే పారదర్శకంగా చేపట్టాలన్నారు. మండల పర్షిత్ అభివృద్ధి అధికారులు వాలంటీర్లకు పూర్తిస్థాయిలో అన్ని విషయాలపై అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. జిల్లాలో ఇంటి నివేశన పట్టాల పంపిణీ, అమ్మఒడి, వై.ఎస్.ఆర్.చేయుత, అర్హుల జాబితాలను ప్రజల నుండి సేకరించాలన్నారు. జిల్లాలో అర్హులైన కౌలు రైతులకు ఋణ అర్హత కార్డులను పంపిణీ చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన కార్యక్రమాన్ని ప్రాధాన్యత అంశముగా తీసుకున్నారని… జిల్లాలో ప్రజల నుండి స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో అధికారులు అందరూ కలిసి పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని…. మండలం స్థాయిలో పనిచేసే అధికారులు పారదర్శకంగా ప్రజలు సేవలు అందించాలని ఆయన కోరారు.

మండల స్థాయిలో అన్ని గ్రామాల్లో మొక్కలు నాటి అవకాశం ఉన్న ప్రాంతాల్లో అధికశాతంలో మొక్కలు నాటాలని ఆయన తెలిపారు. ప్రతి గురువారం ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటాలని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ షాన్ మోహన్, కందుకూరు ఆర్.డి.ఓ. ఓబులేష్, మార్కాపురం ఆర్.డి.ఓ శేషిరెడ్డి, గ్రామీణ నీటిసరఫరా శాఖ ఎస్.ఇ సంజీవరెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్.ఇ కొండయ్య, డ్వామా పి.డి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ డిప్యూటీ సి.ఇ.ఓ సాయి కుమారి, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.