పర్యావరణ ప్రియ ఘననాధులు పూజలకు సిద్ధం ప్రత్యేక ఆకర్షణగా బాహుబలి అకృత ఘననాధులు

పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పర్యావరణ ప్రియ ఘననాధుల ఉత్సవ విగ్రహాలను తయారు చేసి భక్తులచే పూజలు అందుకుకోవటానికి సిద్ధం చేశామని….. పట్టణంలోని ఘననాధ ఉత్సావ విగ్రహాల తయారీ యాజమాని కిషన్ లాల్ తెలిపారు.

వివరాల్లోకి వెళితే శనివారం స్ధానిక విశ్వనాథపురంలోని గణేష్ విగ్రహాల ఆమ్మకాల కేంద్ర యాజమాని కిషన్ లాల్ పొదిలి టైమ్స్ ప్రతినిధి మాట్లాడుతూ గత 22సంవత్సరాల నుండి గణపతి విగ్రహాలు తయారు చేసి ఆమ్మకాలు జరుపుతున్నామని లాభాపేక్షతో
కాకుండా దేవుని సేవలో భాగంగా ఈ వృత్తిని చేపట్టడం వలన ఎటువంటి ఆటుపోట్లు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు కాపాడుట వలనే మేము పని చేస్తున్నామని…… అదేవిధంగా గత నాలుగు సంవత్సరాల నుండి కరువు వలన రైతులు చాల ఇబ్బందులు పడ్డారని… ఈ సంవత్సరం వర్షభావం వలన రైతులు భారీగా కొనుగోలుకు సిద్ధమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే మావద్ద 2అడుగుల నుండి 12 అడుగుల వరకు ఎత్తు కలిగిన వివిధ అకృతులలో విగ్రహాలు ఉన్నాయని తెలిపారు.