రేపు వైయస్ఆర్ నవశకం శిక్షణ తరగతులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన వివిధ రకాల సంక్షేమ పథకాల ఎంపిక కోసం విధి విధానలపై గ్రామ వాలంటీర్లుకు వైయస్ఆర్ నవశకం పేరుతో రేపు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మండల పరిషత్ అధికారులు తెలిపారు. వివరాలు లోకి వెళితే బుధవారం నాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఉదయం పొదిలి గ్రామ పంచాయతీ చెందిన వాలంటీర్లుకు మధ్యాహ్నం నుండి మండలలోని ఇతర 19 పంచాయతీలకు వాలంటీర్లుకు బియ్యం కార్డు , వైయస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు , జగనన్న విద్య దివేన ,జగనన్న వసతి దివేన కార్డు , అమ్మబడి , టైలర్స్ , రజక , నాయ బ్రాహ్మణ షాపులు , లబ్ధిదారుల ఎంపిక , వైయస్ఆర్ కాపు నేస్తం , వైయస్ఆర్ పెన్షన్ కనుక కార్డు , వైయస్ఆర్ సున్న వడ్డీ పథకం , వైయస్ఆర్ మత్యకార నేస్తం , వైయస్ఆర్ నేతన్న నేస్తం , ఇమామ్ , మౌజిస్ , పాస్టర్లు ఎంపిక గ్రామసభ నిర్వహణ గురించి మండల రెవెన్యూ తహశీల్దార్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల విద్యా శాఖ అధికారి వసతి గృహ అధికారిలు శిక్షణ ఇస్తారని కావున గ్రామ వాలంటీర్లు శిక్షణ తరగతుల్లో హాజరు కావలని ఒక ప్రకటన తెలిపారు