విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు

అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక భవిత పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని భవిత పాఠశాల నందు మండల విద్యాధికారి కె రఘురామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులైన పిల్లలను చిన్ననాటి నుండే తల్లిదండ్రులు వారిలోని ప్రతిభను గుర్తించాలని…. అలాగే భవిత వంటి పాఠశాలలు వీరికి ఎంతగానో ఉపయోగకరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లల మానసిక ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయని కాబట్టి తల్లిదండ్రులు వీరి సేవలను వినియోగించుకోవాలని అన్నారు. పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలకు రవాణా సౌకర్యం ఉన్నట్లయితే దూరం నుంచి వచ్చే పిల్లలకు మేలు జరుగుతుందని ఆకాంక్షించారు

అనంతరం ఆర్ డబ్ల్యు ఎస్ సహకారంతో భవిత పాఠశాలలో ఏర్పాటుచేసిన కుళాయిని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి నోట్ బుక్స్ ఆటవస్తువులను ప్రధానం చేశారు.

స్థానిక పొదిలి రమ్య హోటల్ యజమాని రామిరెడ్డి పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ ర్యాలీలో అధికారులు పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగరాజు, ఐ ఈ ఆర్ టి ఉపాధ్యాయులు గోపాలకృష్ణ, షాహిదా బేగం, ఫిజియోథెరపిస్ట్ డి ప్రవీణ్ కుమార్, కేర్ టేకర్ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.