రోగనిరోధక శక్తి టీకాలను చిన్నారులకు వేసి లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్
చిన్నారులకు జిల్లా కలెక్టర్ పొలా భాస్కర్ రోగనిరోధక శక్తి టీకాలు వేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే చిన్నారులకు రోగనిరోధక శక్తిని పెంచేందుకు ప్రభుత్వం వేసే టీకాలను స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు గురువారంనాడు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పొలా భాస్కర్ లాంఛనంగా ప్రారంభించారు…… అనంతరం పొదిలి ప్రభుత్వ వైద్యశాల ప్రగతి నివేదికను పరిశీలించి ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసి వైద్యశాలకు అవసరమైన మౌళిక వసతులు గురించి నివేదిక పంపించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ తహశీల్దారు ప్రభాకరరావు, పొదిలి ప్రభుత్వ వైద్యశాల ప్రధాన వైద్యాధికారి డాక్టర్ చక్రవర్తి, వైద్యులు డాక్టర్ రఫీ, డాక్టర్ సుష్మా , ఉప్పలపాడు వైద్యులు డాక్టర్ రాధాకృష్ణ మరియు జిల్లా మరియు మండల వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.