సిఎం సహాయ నిధికి లక్ష రూపాయలు విరాళం అందజేసిన సాయి రాజేశ్వరరావు

ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా లక్ష రూపాయల చెక్కును మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి చేతికి మాజీ జడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు అందజేశారు.

వివరాల్లోకి వెళితే లాక్ డౌన్ లో భాగంగా నిరుపేదల కుటుంబాల కొరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిత్యావసరాల కిట్స్ పంపిణీ కార్యక్రమానికి, పారిశుద్ధ్య కార్మికుల అన్నదానానికి, సీఎం సహాయనిధికి గాను లక్ష రూపాయల చెక్కును శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డికి విరాళంగా ఇచ్చినట్లు పొదిలి మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు శ్రీ సాయి రాజేశ్వరరావు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఒగ్గు నర్సింహారావు, ఓబులశెట్టి నాగేశ్వరరావు, ముల్లా షుకూర్, అహ్మద్, ఓబులశెట్టి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.